Thursday, November 14, 2024

జునాగఢ్ దర్గా ఘర్షణల్లో ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

జునాగడ్ ( గుజరాత్) : గుజరాత్ లోని జునాగఢ్‌లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసి శుక్రవారం రాత్రి చెలరేగిన అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా , పలువురు పోలీస్‌లు గాయపడ్డారు. జునాగఢ్, మాజేవాడి ప్రాంతంలో దర్గాను అక్రమంగా నిర్మించారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించి దర్గా భూ యాజమాన్య హక్కు పత్రాలను సమర్పించాలని జూన్ 14ప నగరపాలక సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో అధికారులు దర్గా కూల్చివేతకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. మసీదును తొలగించడానికి యాంటీ ఎంక్రోచ్‌మెంట్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి దాదాపు 600 మంది అక్కడకు చేరుకుని రహదారులను దిగ్బంధం చేశారు. జునాగఢ్ డిప్యూటీ ఎస్‌పి, ఇతర పోలీస్ సిబ్బంది ఆందోళన కారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటకు పైగా చర్చించిన తరువాత రోడ్డుపైన పెట్టిన అడ్డంకులను తొలగించడానికి పోలీస్‌లు ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి 1015 గంటల సమయంలో పోలీస్‌ల పైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు.

ఓ వాహనాన్ని తగుల బెట్టారు. రాళ్ల దాడిలో జునాగఢ్ డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దీంతో పోలీస్‌లు భాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళనకారులపై లాఠీ చార్జి చేశారు. రాళ్ల దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తరువాత ఈ మరణానికి కారణమేమిటో తెలుస్తుందని పోలీస్‌లు తెలిపారు. 174 మంది ఆందోళనకారులను అదుపు లోకి తీసుకున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News