ఝరాసంగం: మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో, మీసేవ కేంద్రాల వద్ద రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కుల వృత్తుల ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి లక్ష రూపాయలు ప్రకటించడంతో శనివారం ఝరాసంగం తహశీల్దార్ కార్యాలయం, మీసేవ కేంద్రాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో కుల ఆదాయ దృవీకరణ పత్రాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు లబ్ధిదారులు కాస్తున్నామన్నారు. 20 వరకు కులవృత్తులకు ఆర్థిక సాయం అందించే గడువు ముగుస్తుందని సమయం లేనందున సరైన సమయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తామో లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
ఈ సమస్యపై మన తెలంగాణ నయాబ్ తహశీల్దార్ రాజిరెడ్డికి వివరణ కోరగా రాత్రి సమయంలో కూడా తహశీల్దార్ కార్యాలయంలో ఉండి కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మండల వ్యాప్తంగా కుల దృవీకరణ పత్రాలు 2800 వచ్చాయి అన్నారు. సర్వర్ సరిగ్గా రాకపోవడంతో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని సర్వర్ క్లియర్‌గా వస్తే అందరికీ లబ్ధిదారులకు పత్రాలను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.