Monday, December 23, 2024

25న ‘ఆర్యవైశ్య హై ప్రొఫైల్ వధూవర పరిచయ వేదిక’

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట: ఉన్నత చదువులు చదివి వివిధ రంగాలలో స్థిరపడిన ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఉన్న వధూవరులకు వివాహం చేసుకోదలచిన అవివాహితులకు మంచి భాగస్వామిని ఎంచుకునేందుకు సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ‘ఆర్యవైశ్య హై ప్రొఫైల్ వధూవరు పరిచయ వేదికను‘ నిర్వహించనునట్లు సంఘం అధ్యక్షులు మార్యాల జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి సురేష్ పాలూరిలు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఆర్యవైశ్య పరిచయ వేదికను ఈ నెల 25న సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిచయ వేదికలో పాల్గొనాలనుకునేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. ఏలాంటి లాభాపెక్ష లేకుండా తాము ఈ కార్యక్రమంను నిర్వహిస్తున్నామని, కేవలం వైశ్య సామాజిక వర్గంలోని తల్లిదండ్రులకు తమ పిల్లలకు మంచి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నందుకు ఒక వేదిక ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రైవేట్ మ్యారేజ్ కన్సల్టెన్సీలు కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయని అందువల్ల అవివాహిత సంతానం ఉన్న తల్లిదండ్రులకు ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మరిన్ని వివరాల కోసం 9948 388 199, 924 6156646 నెంబర్‌లను సంప్రదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి శ్రీనివాసరావు, కన్వీనర్ తేలుకుంట పూర్ణచందర్రావు ,కో-కన్వీనర్లు చల్లా ప్రకాష్, ముత్యాల శంకర్, ప్రాజెక్ట్ చైర్మన్ అల్లాడి హరీష్ కుమార్, ప్రాజెక్టు కో-కన్వీనర్ సత్యవరపు వీరభద్రరావు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News