Thursday, November 28, 2024

గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవి

- Advertisement -
- Advertisement -

జనగామ ప్రతినిధి : గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. శనివారం పాలకుర్తి మండలం పెద్దతండా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి 500 జనాభా పైబడిన గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. గిరిజన ప్రతినిధులు పారదర్శకంగా గ్రామాల అభివృద్ధికి వారే స్వయంగా ప్రతిపాదనలు సమర్పించి పనులు నిర్వహించుకోవడం శుభపరిణామమని తెలిపారు.

గిరిజనులు వారి సంస్కృతి, సాంప్రదాయాలను ఆచారాలు పులాజిబాబా, దుర్గామాత, సంత్ సేవాలాల్ ప్రబోధనల ద్వారా సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో గిరిజనులు ఉంటారని, ఈ గిరిజన దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు గిరిజన సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలతో కలెక్టర్ అదనపు కలెక్టర్లకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ రాంరెడ్డి, డీపీఓ రంగాచారి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, పాలకుర్తి సర్పంచ్ యాకాంతరావు, ఎంపీడీవో అశోక్‌కుమార్, తహసీల్దార్ పాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News