Saturday, November 23, 2024

విశ్వనగరి.. సమృద్ధి జలసిరి!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నీరే సమస్త జీవకోటికి జీవనాధారం. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతగలం కానీ నీరు లేకుండా జీవించడం అసాధ్యం. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణ జలమండలి నిర్వర్తిస్తుంది. రాబోయే 50 ఏళ్ల వరకు తాగునీటి సరఫరాకు భరోసా కల్పిస్తూ 100 శాతం మురుగు శుద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా అస్థిత్వం కూడా పోగొట్టుకుని నిర్వహణ భారంతో అప్పులు ఒకవైపు, నెలనెలా తడిసి మోపెడైన కరెంటు బిల్లులతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితి మరోవైపు వెరసి బోర్డు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ప్రభుత్వానికి పరిస్థితిని ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. చలించిన దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ఏర్పాటు కాక ముందు పరిస్థితి. కానీ.. 2014లో తెలంగాణ ఏర్పాటు కావడం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి పూనుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం, పురపాలక మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, ఎండీ దానకిశోర్ నాయకత్వంలో అటు తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధిని సమర్థంగా నిర్వహిస్తూ జలమండలి ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటోంది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాలకు సైతం తాగునీరు అందిస్తుంది. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీ నరసింస్వామి దేవాలయం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిసరాల్లో భూగర్భ డ్రైనేజీ, వరద నీటి కాలువ వ్యవస్థల నిర్మాణ బృహత్తర ప్రణాళికను రూపకల్పన చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జలమండలిపై పెట్టింది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నూతనంగా 31 మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ), ఎఫ్‌ఎస్టీపీలను ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తోంది. తక్కువ ధరకే వినియోగదారులకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సేవల్ని అందిస్తోంది. ఇదీ గత పదేళ్లలో జలమండలి సాధించిన ప్రగతి. ప్రస్తుతం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా పయనిస్తోంది.

గడచిన 10 ఏళ్లలో జలమండలి సాధించిన మైలురాళ్లు:
1. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన సంవత్సరంలో సిఎం కెసిఆర్ మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి రూ.338.54 కోట్ల వ్యయంతో 9 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టింది. దీంతో 3.80 లక్షల ప్రజలకు లబ్ది చేకూరింది.
ప్రసిద్ధి చెందిన హుస్సేన్ సాగర్ పరిరక్షణ కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూకట్ పల్లి నుంచి వచ్చే మురుగు నీటిని హుస్సేన్ సాగర్ లో కలవకుండా వేరే ప్రాంతానికి మళ్లించింది. దీనికోసం ప్రభుత్వం రూ.58.96 కోట్లు వెచ్చించింది. మ్యాన్ హోళ్లలో మానవ రహిత పారిశుద్ధ్య పనులు నిషేధించాలని సర్క్యులర్ జారీ చేశారు. మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన – జాతీయ సఫాయి కర్మచారి ఆందోళన్ కు చెందిన బెజవాడ విల్సన్ సమన్వయంతో మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనపై జలమండలి అవగాహన కల్పించింది. ఇంకుడు గుంతల ప్రాధాన్యం, వాటి నిర్మాణ అవశ్యకత ప్రజలకు తెలపడానికి జలభాగ్యం కార్యక్రమం కింద జలమండలి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను తయారు చేసింది. రెండేళ్లలో సుమారు 7500 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టింది. 2017 ఏప్రిల్ 21న జలభాగ్యం లోగోను ఆవిష్కరించారు. మానవ రహిత పారిశుద్ధ్య నిర్వహణ పనులకు జలమండలి సీవర్ జెట్టింగ్ యంత్రాలను తీసుకువచ్చింది. హడ్కో ప్రాజెక్టులో నగరంలోని ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.1900 కోట్ల వ్యయంతో మొత్తం 56 కొత్త రిజర్వాయర్లు, 1900 కిలో మీటర్ల పైపు లైన్ నెట్ వర్క్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 40 లక్షల మందికి ప్రయోజనం లభించింది. రింగ్ మెయిన్ ప్రాజెక్టులో భాగంగా ఆర్సీ పురం, పటాన్ చెరు, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఐటీ కారిడార్ తదితర ప్రాంతాల ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి రూ.422.80 కోట్ల తో ఘన్ పూర్ నుంచి పటాన్ చెరు వరకు 1800 ఎంఎం డయా పైపు లైన్ పనులు పూర్తి చేశారు.
రింగు మెయిన్ ప్రాజెక్టులో భాగంగానే కొల్లూరులోని డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కాలనీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు తాగునీరందించేందుకు రూ.285 కోట్ల వ్యయంతో ముత్తంగి నుంచి కోకాపేట వరకు 3000 ఎంఎం డయా పైపు లైన్ పనులు పూర్తి చేశారు.
జలమండలి వినియోగిస్తున్న సీవర్ జెట్టింగ్ యంత్రాల పనితీరును తెలుసుకోవడం, అధ్యయనం చేసింది.
రింగ్ మెయిన్ ప్రాజెక్టులో భాగంగా గోదావరి, కృష్ణా వాటర్ ఇంటర్ కనెక్షన్ కోసం 158 కిలో మీటర్ల పొడవైన 3000 ఎంఎం డయా పైపు లైన్ పనులు పూర్తి చేశారు.హైదరాబాద్ నగర చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఓఆర్‌ఆర్ ఫేజు – 1 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ. 613 కోట్లతో 1571 కిలో మీటర్ల మేర పైపు లైన్ నెట్ వర్క్ వేయడంతో పాటు కొత్తగా 164 రిజర్వాయర్లు నిర్మించారు. దీనివల్ల 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలకు లబ్ది చేకూరింది. మొత్తం 4.36 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందారు. కేశవాపూర్ రిజర్వాయర్ – నగరానికి నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులో ఉండేందుకు కేశవాపురం దగ్గర రూ.4777 కోట్ల వ్యయంతో 5 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే నీటి సంక్షోభం ఏర్పడినప్పుడు ఇక్కడి నీటిని వాడుకునే వీలుంది. పైపు లైన్లలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు (సాలిడ్ వేస్టేజ్) తొలగించడానికి సూపర్ సక్కర్ యంత్రాలను తీసుకొచ్చారు.
2014 నుంచి 2023 వరకు జలమండలి సాధించిన భారీ విజయాలు
1. నెలకు 20వేల ఉచిత తాగునీరు సరఫరా
జీహెచ్‌ఎంసీలో 2019 లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. నగరంలోని అన్ని గృహ వినియోగదారులు దీనికి అర్హులే. 2020 డిసెంబరులో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 11.7 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధి పొందారు. అందులో 2.5 లక్షల స్లమ్ కనెక్షన్ వినియోగదారులు ఉన్నారు. ఈ పథకం కింద మొత్తంగా నగర పరిధిలో రూ.815 కోట్లు విలువైన బిల్లులు మాఫీ చేశాం.
2. రూ.1 కే పేదలకు నల్లా కనెక్షన్
తక్కువ ధరకే నల్లా కనెక్షన్లు ఇచ్చి జలమండలి పేదలకు అండగా నిలిచింది. దారిద్య్ర రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు రూ.1 కే న్లలా కనెక్షన్లు ఇచ్చింది. దీని ద్వారా మొత్తం 53 వేల మంది వినియోగదారులు లబ్ది పొందారు. ఇదే కాకుండా మరో 30 వేల మంది వినియోగదారులకు రూ.100 కు కనెక్షన్ ఇచ్చింది. ఈ రెండు పథకాల వల్ల మొత్తం 83 వేల మంది ప్రయోజనం పొందగా.. రూ.25 కోట్ల బెనిఫిట్ లభించింది.
3. వంద శాతం మురుగు శుద్ధి దిశగా అడుగులు
హైదరాబాద్ మహా నగరంలో రోజూ ఉత్పన్నమయ్యే మురగు నీటిని వంద శాతం శుద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం రూ.3866 కోట్ల వ్యయంతో 1259.5 ఎంఎల్డీల సామర్థ్యం గల కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తోంది. వీటి నిర్మాణ బాధ్యతను జలమండలిపై పెట్టింది. వీటిని మొత్తం 3 ప్యాకేజీల్లో నిర్మిస్తున్నారు.
1) ప్యాకేజీ-I లో అల్వాల్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
2) ప్యాకేజీ-II లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.33 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
3) ప్యాకేజీ-III లో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.5 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు.
4. మురుగు శుద్ధి విధానాలు : మాన్యువల్ నుంచి యాంత్రికం వరకు
హైదరాబాద్ మహా నగరంలో పారిశుద్ధ్య విధానం పూర్తిగా మాన్యువల్ నుంచి యాంత్రికానికి మారింది. గతంలో మనుషులు శుద్ధి చేసే వారు. కానీ ఇప్పుడు పూర్తిగా యంత్రాలతో క్లీన్ చేస్తున్నారు. దీనికోసం నగర వ్యాప్తంగా మొత్తం 212 సివర్ జెట్టింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. దీంతో పాటు పైపు లైన్లలో పేరుకు పోయిన చెత్తను శుభ్ర పరచడానికి సీవర్ క్రాక్, హైడ్రాలిక్ సిల్ట్ గ్రాబర్ వంటి పరికరాలు వాడుతున్నారు. జలమండలిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు సురక్షితంగా విధులు నిర్వర్తించేందుకు దుస్తులు, బూట్లు, గ్లోవ్స్, ఇతర రక్షణ పరికరాలు అందజేస్తున్నారు. హైదరాబాద్ పౌరుల శ్రేయస్సు కోసం నమ్మకమైన నీటి సరఫరా, సమర్థమైన మురుగునీటి నిర్వహణలో జలమండలి చేస్తున్న కృషి, అంకితభావానికి నిదర్శనం.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News