Saturday, November 23, 2024

ఎటుపోయినయ్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పక్కా లెక్కాపత్రాలతో ఉండే, ఉం డాల్సిన ఆర్థిక వ్యవస్థ నుంచి ఇప్పుడు రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నో ట్లు గల్లంతయ్యాయి. ఈ నోట్ల సంబంధిత వి వరాలు సమాచారం ద్రవ్య విషయాల అత్యున్నత అధీకృత సంస్థ ఆర్‌బిఐ వద్ద లేదని వెల్లడైంది. సామాజిక కార్యకర్త మనోరంజన్ రా య్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అర్జీ క్రమంలో ఈ అత్యంత కీలకమై న సున్నితమైన ఆర్థిక ద్రవ్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాతనోట్ల రద్దు తరువాత వాటి స్థానంలో రూ.500 నోట్ల ముద్రణ దశ లో గోల్‌మాల్ జరిగింది. దేశంలో నగదు నో ట్ల ముద్రణ జరిగే మూడు టంకశాలలు (మింట్ల) నుంచి నూతనంగా కడక్‌కడక్‌గా రూపొందించిన రూ.500 నోట్ల కట్టలను వె లువరించారు. మొత్తం 8810 మిలియన్ల నో ట్లుగా వీటిని వెలువరించారు.

అయితే వీటిలో నుంచి ఆర్‌బిఐకి కేవలం 7260 మిలియన్ల నోట్లు అందాయి, మిగిలిన 1,760.85మిలియన్ల నోట్లకు సంబంధించిన వివరాలు ఇప్పు డు అంతుచిక్కడం లేదు. సాధారణంగా ప్రతిరూపాయి ముద్రితం అయినా దీని చేరిక దీనికి సంబంధించిన వివరాలు ఆర్‌బిఐ వద్ద ఉంటాయి. అయితే ఆర్టీఐ దరఖాస్తు క్రమంలో ఇవి ఆర్‌బిఐకి చేరకుండా ఎక్కడికి వెళ్లాయనేది తేలాల్సి ఉంది. ఎక్కడికి వెళ్లాయో తెలియని ఈ రూ 500 నోట్లు 1,760.88 నోట్లు అంటే రూ 88వేల కోట్లకు పైగా మొత్తం లెక్కతేలాల్సి ఉంది.
మూడు మింట్లలో కరెన్సీ నోట్ల లెక్కలు
దేశంలో మూడు కరెన్సీ ముద్రణాలయాలు ఉన్నాయి. బెంగళూరులోని భారతీయ రిజర్వ్‌బ్యాంక్ నోట్ ముద్రాణ్ (ప్రైవేటు) లిమిటెడ్, మహారాష్ట్ర నాసిక్‌లోని కరెన్సీనోట్ ప్రెస్, మధ్యప్రదేశ్ దేవాస్ ప్రింటింగ్ కేంద్రాలలో నోట్లు చపాయిస్తారు. వీటిని పద్ధతి ప్రకారం చలామణిలోకి తీసుకువచ్చే గురుతర బాధ్యత ఆర్‌బిఐదే. ఆర్టీఐ ద్వారా వేసిన ప్రశ్నకు జవాబు క్రమంలో నాసిక్ మింట్ అధికారులు తమ వద్ద ప్రింటయిన నోట్లలో 1,662.000 మిలియన్ల రూ 500 నోట్లను 201617లో ఆర్‌బిఐకి సరఫరా చేసినట్లు తెలిపారు. కాగా బెంగళూరు మింట్ నుంచి 5,195.65 మిలియన్లు , దేవస్ మింట్ నుంచి 1,950.000 మిలియన్ నోట్లను పంపించారు.
అచ్చయిన వాటికి అందిన వాటికి పొంతనేది?
ఆర్‌బిఐకి ఈ మూడు ప్రింటింగ్ కేంద్రాల నుంచి అందిన మొత్తం రూపాయలు విలువను లెక్కిస్తే అందాల్సిన వాటికన్నా ఆర్‌బిఐకి తక్కువ మొత్తంలో అందడం ఇప్పుడు సంచలనాత్మక విషయం అయింది. ఆర్టీఐ దరఖాస్తు మేరకు పలు ఇతర వివరాలు కూడా వెలువడ్డాయి. నాసిక్ ప్రింటింగ్ కేంద్రం నుంచి 2015 ఎప్రిల్ నుంచి 2016 డిసెంబర్ మధ్యకాలంలో నూతనంగా రూపొందించిన 500 నోట్లు 375.450 మిలియన్ నోట్ల వరకూ ఉన్నాయి, అయితే ఆర్‌బిఐ రికార్డులలో అందిన నోట్లు కేవలం 345.000 . ఇక ఇప్పుడు జాడతెలియకుండా పోయిన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ల నోట్లు నాసిక్ మింట్‌లో అచ్చయినవే.
రాజన్ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నప్పుడు
ఇప్పుడు గల్లంతు బాపతు వ్యవహారం లెక్కల్లోకి చేరిన ఈ నోట్లు రఘురామ్ రాజన్ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్న దశలో చోటుచేసుకుందని ఆర్టీఐ దరఖాస్తుతో స్పష్టం అయింది. సంబంధిత విషయాన్ని తన అర్జీ ద్వారా తెలుసుకున్న ఆర్టీఐ కార్యకర్త ఈ సమాచారంపై సెంట్రల్ ఎకనామిక్ ఇంటలిజెన్స్ బ్యూరో (సిఇఐబి)కి తెలిపారు. ఈ హెచ్చుతగ్గుల విషయాన్ని ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కు కూడా వివరించారు. ఈ భారీ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని అభ్యర్థించారు.
తేడా సాధారణమేనన్న ఆర్‌బిఐ పెద్దలు?
అయితే ఆర్‌బిఐ అధికారులు కొందరు కొన్ని సందర్భాలలో ఈ విధంగా ప్రింటింగ్‌కు సరఫరాకు మధ్య తేడా ఉంటుందని సమర్ధించారు. కాగా ఇటీవలే ఆర్‌బిఐ సమర్పించిన వార్షిక నివేదికలో దేశంలో నకిలీ నోట్ల చలామణి పెరుగుతోందని తెలిపింది. అంతకు ముందటి ఏడాదితో పోలిస్తే 202223లో 14.4 శాతం ఎక్కువగా దొంగనోట్ల చలామణి పెరిగిందని విశ్లేషించారు. ఈ దశంలో దేశంలో 91,110 వరకూ రూ 500ల దొంగనోట్లను గుర్తించారు. ఇక ఈ సమయంలోనే దేశంలో 9806 వరకూ రూ 2000 నోట్లు దొంగనోట్లుగా గుర్తించారు. అంతకు ముందటితో పోలిస్తే ఈ నోట్లు తగ్గాయని తెలిపారు. కాగా మే 19వ తేదీన ఆర్‌బిఐ వెలువరించిన సర్కులర్‌లో దేశంలో ఇకపై రూ 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై రెండువేల నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశించారు. కాగా ఇప్పటివరకూ తమ వద్ద ఉన్న రెండువేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు పౌరులకు ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకూ గడువు ఇచ్చారు. అప్పటివరకూ దేశంలో ఈ రెండువేల నోట్లు చెల్లుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News