Sunday, December 22, 2024

నకిలీ కేబుల్ వైర్లను పట్టుకున్న సెంట్రల్ టాస్క్‌ఫోర్స్

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: డబ్బును అడ్డదారుల్లో సంపాదించాలనే అత్యాశతో డిల్లీ నుండి నకిలీ కేబుల్ వైర్లు తెచ్చి అమాయకపు ప్రజలకు కంపెన్లీ వైర్లంటూ ముకుల్ దుర్గర్ అంటగడతూ గత కొంత కాలంగా సంపాదిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన సెంట్రల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుల్తాన్ బజార్ స్టేషన్ అధికారుల సహాయంతో కోఠిలోని జైన్‌మార్కెట్ ప్రాంతంలో ఉన్న శ్రీబాలాజి ఎన్‌టర్‌ప్రైజెస్ షాపు పై దాడి చేశారు. విలువైన నకిలీ కేబుల్ వైర్లను పట్టుకున్నారు. అనంతరం నిందితున్ని సుల్తాన్‌బజార్ స్టేషన్‌లో కేబుల వైర్లతో సహా అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతుందని సుల్తాన్‌బజార్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.రాధాకృష్ణరావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫోలీసు రఘునాధ్, సాయి కిరణ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News