Sunday, November 24, 2024

సంక్షేమ పథకాలతో రాష్ట్రం దూసుకుపోతుంది

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్ : సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాల్లో,అభివృద్ధ్దిలో దూసుకుపోతుందని ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ అన్నారు. బిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామంలో చేపట్టిన 3 కోట్ల 68 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో అన్ని వీధుల్లో తిరుగుతు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని కేవలం సిఎం కెసిఆర్ పాలయనలో ఇది సాధ్యమైందన్నారు.

బిజెపి ప్రభుత్వం మాకు ఒక్కసారి అధికారం ఇస్తే అభివృద్ధ్ది చేసి చూపిస్తామని చేప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారని అలాగే గతంలో సొంత రాష్ట్రం గుజరాత్‌లో 15 సంవత్సరాలు సీఎంగా పాలించారని అప్పుడు చేయలేని అభివృద్ధ్ది ఇప్పుడు ఏం చేస్తారని విమర్శించారు. గత ప్రభుత్వాలు ప్రజలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్, రక్తహీనతతో బాదపుడుతున్న మహిళలకు న్యూట్రీషియన్ కిట్, పింఛన్‌లు, రైతుబందు, రైతుబీమా లాంటి పథకాల గురించి వివరించారు.

అలాగే గ్రామంలో కొందరు రైతుల భూమి విషయంలో త్వరలో జిల్లా కలెక్టర్, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపిపి గాల్‌రెడ్డి, జడ్పిటిసీ పద్మ నాగభూషణం గౌడ్, ఎంపిటిసీల ఫోరం మండల అద్యక్షుడు దాయిరి సాయిరెడ్డి, సర్పంచ్ శామయ్య, విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపిపి గుడిసె యాదగిరి, మండల కన్వీనర్ రామచంద్రం, రైతుబందు జిల్లా డైరెక్టర్ బోయిని మాధవి, విడిసీ అద్యక్షుడు నాగరాజు, టెంపుల్ చైర్మన్ సిద్దరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News