హైదరాబాద్: నగరంలో ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ , జూనియర్ కాలేజ్ (సేవ్ వాటర్ అండ్ నేచర్), గ్రీన్ ఇండియా చాలెంజ్ సహకారంతో హఫీజ్‌పేటలోని మీడికుంట లేక్ వద్ద క్లీన్-అప్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్లీన్-అప్ డ్రైవ్ ,పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మీడికుంట లేక్ వద్ద ఇప్పటివరకు ఒక టన్ను వ్యర్థాలను వేరుచేశారు. ఓజోన్ రన్ వ్యవస్థాపకులు, బిల్వోవా వున్నం, తీర్ధా వున్నం ఈ క్లీన్-అప్ డ్రైవ్‌లో పాల్గొని ది ఓజోన్ రన్ ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల ప్రదేశాల ప్రాముఖ్యత,వ్యక్తుల పాత్ర గురించి వివరించారు. ఓజోన్ పరుగుకు 93 రోజులు అనే శీర్షికతో రాబోయే ఓజోన్ రన్ గురించి స్వచ్ఛ కార్యక్రమం అనంతరం ఫౌంటెన్‌హెడ్ విద్యార్థులు సేరిలింగంపల్లి కార్పొరేటర్‌కు వినతిపత్రం అందించారు.ఈసందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ శంకరయ్య వారి సహాయాన్ని కోరారు. స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా ఫౌంటెన్ హెడ్ కొయ్య సుధా రాణి, వైస్ ప్రిన్సిపాల్ అనుపమ సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని పేర్కొన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మీడికుంట చెరువు వద్ద క్లీన్ ఆప్ డ్రైవ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -