Saturday, December 21, 2024

బండి సంజయ్‌ను కలిసిన బిజెపి శ్రేణులు

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెదగాని సోమయ్య, తొర్రూరు బిజెపి శ్రేణులు హైదరాబాద్‌లో శనివారం కలిశారు. ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎనికైన పెదగాని సోమయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు మరోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియామకం చేసినందుకు బండి సంజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు.

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం కోసం కష్టపడి పని చేయాలని బండి సంజయ్ సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు, తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, రూరల్ మండల అధ్యక్షుడు సురేశ్, పెద్దవంగర మండల అధ్యక్షుడు సుధాకర్, ఎస్టీ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షుడు బిక్షంనాయక్, బీజేపీ తొర్రూరు అర్బన్ ప్రధాన కార్యదర్శి పైండ్ల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News