తార్నాక: మాణికేశ్వరి నగర్ భవిష్యత్ తరానికి ఆసుపత్రి నిర్మిద్దామని బస్తీ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 75వ రోజుకు చేరుకున్నాయి.శనివారం దీక్షలో పాల్గోన్న వారికి టిడిపి తార్నాక డివిజన్ అద్యక్షుడు గండికోట విజయ్‌కుమార్,బిఆర్‌ఎస్ నాయకుడు గండికోట కుమార్‌లు పూలదండలు వేసి దీక్షను ప్రారంభించి తమ సంఘీభావాన్ని తెలిపారు.ఈ సందర్బంగా దీక్షలో పాల్గోన్న వారు మాట్లాడుతు ఆసుపత్రి నిర్మాణం కొరకు గత 75 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని తెలిపారు.ప్రజా ప్రతినిదులు స్పందించి ఆసుపత్రి నిర్మాణం కోరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆసుపత్రి నిర్మాణం వల్ల మానికేశ్వరి నగర్ ప్రజలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు.ఆసుపత్రి నిర్మాణం కోసం అదికారులు,ప్రజాప్రతినిదులు కృషి చేయాలని కోరారు. అనంతరం సాయంత్రం మాణికేశ్వరి నగర్ సీనియర్ కాంట్రాక్ట్‌ర్ తమ్మిశెట్టి రాము వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు ఓర్సు క్రిష్ణ,కాంగ్రెస్ నాయకులు ఏసి నరసింహా,వేమలు శ్రీనివాస్,బోదాసు నర్సింహ్మా,వార్డు మెంబర్ ఓర్సు శేఖర్ తదితరులు ల్గొన్నారు.