Friday, December 20, 2024

100% వెరైటీ, 100% తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్

- Advertisement -
- Advertisement -

తెలుగు నెంబర్ వన్ ఓటీటీ మాధ్యమం ఆహా.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, చార్మింగ్ బ్యూటీ శ్రీలీలతో ‘100% వెరైటీ, 100 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్’ క్యాంపెయినింగ్‌ను ప్రారంభించింది. మహేష్‌బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో భారీ చిత్రాలను రూపొందించడమే కాకుండా ఐకాన్ స్టార్‌తో ఇంతకుముందు అల వైకుంఠపురంలో, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ క్యాంపెయినింగ్‌ను డైరెక్ట్ చేశారు. యాక్షన్, రొమాన్స్, డ్యాన్స్, డ్రామా.. ఇలా అన్ని జోనర్స్ బ్యాక్‌డ్రాప్‌లకు సంబంధించిన సన్నివేశాలతో తెలుగు ప్రేక్షకులకు ఆహా నిరంతరం కనెక్ట్ అవుతోంది. ఇప్పుడు ఆహా ప్రారంభించిన ఈ సరికొత్త క్యాంపెయినింగ్ ద్వారా ప్రేక్షకులందరూ వారి కుటుంబాలతో, స్నేహితులతో కలిసి ఉండే లా ప్రతి క్షణాన్ని ఎంతో గొప్పగా మార్చి వేస్తుంది ఆహా.

Also Read: జెడి చక్రవర్తిని ప్రేమిస్తున్నాను… పెళ్లి చేసుకుంటాను: విష్ణు ప్రియ

ఈ సందర్భంగా ఆహాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఆహాతో మరోసారి కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉంది. మూడేళ్ల ప్రయాణంలో ఆహా ఎందరో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అందుకు కారణం… నిరంతరం వైవిధ్యమైన కంటెంట్‌ను అందించడమే. డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులందరికీ ఇదొక గమ్యస్థానంగా మారింది”అని అన్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ “ప్రేక్షకుల సాధారణ జీవితా ల్లో భాగం కావడానికి ఆహా ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది.

వారి కంటెంట్‌ను 6 ఏళ్ల వయ సు నుంచి 65 ఏళ్ల వయసున్న వారి వరకు వీక్షించవచ్చు. తాజాగా ఆహా ప్రారంభించిన ‘100% వెరైటీ, 100% తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్’ క్యాంపెయినింగ్ ఆడియెన్స్ జీవితాల్లోకి మరింత ఆనందాలను తీసుకువస్తుంది”అని తెలిపారు. ఆహా సీఈఓ రవికాంత్ సబ్నవిష్ మాట్లాడుతూ “మేం ఇదివరకే అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ను అందిస్తామని చెప్పాము. ఇప్పుడు ప్రారంభించిన ‘100% వెరైటీ, 100% తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్’ క్యాంపెయినింగ్ అనేది మా కమిట్‌మెంట్ ను మరింత పెంచింది. దాన్ని మేము ఇంకా గొప్పగా నిలబెట్టుకుంటాము”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News