Friday, November 15, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), గౌహతి, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ జోన్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1 సాధించారు. రమేష్ సూర్య తేజ రెండో ర్యాంకు, రాఘవ గోపాల్ నాలుగో ర్యాంకు సాధించారు.

Also Read: అక్కడ ఆడేందుకు భయమెందుకు?

ఈ ఏడాది, ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన రెండు పేపర్లకు మొత్తం 1,80,372 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 43,773 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో 36,204 మంది విద్యార్థులు, 7,509 మంది విద్యార్థినులు ఉన్నారు.

ఈ సంవత్సరం పరీక్షలో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే నెగెటివ్ మార్కింగ్ శాతం తక్కువగా ఉంది. జూన్ 4న పరీక్ష నిర్వహించి.. జూన్ 9 నుంచి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తెచ్చి, జూన్ 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసి.. జూన్ 12న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News