Wednesday, December 25, 2024

గో పూజ ఎంతో పుణ్యం

- Advertisement -
- Advertisement -
  • కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి

సిద్దిపేట : గో పూజ ఎంతో పుణ్యం కలుగుతుందని కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి అన్నారు. ఆదివారం పారిపల్లి విధీలో గల రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయం పక్కన గోశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం పక్కన 250 గజాల స్థలాన్ని సేకరించి భక్తులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి గోషాలను నిర్మించి రామరాజు రావిచెట్టు హనుమాన్ గోశాలగా నామకరణం చేసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఆచరించి చూపారన్నారు. గోవులు, బ్రాహ్మణులు ఎక్కడ సుఖ సంతోషాలతో ఉంటారో అక్కడ అంతా కూడా పాడి పంటలతో సశ్యశ్యామలంగా ఆ ప్రాంత మంతా ఉంటుందన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆంజనేయ స్వామి భక్తుడని ఆలయాల అభివృద్ధిలో తాను ముందుంటాడని నవంబర్‌లో జరిగినటువంటి అతిరుద్ర యాగానికి హరీశ్‌రావు అన్ని విధాల సహకరించి కార్యక్రమం విజయవంతం చేయడంలో పాల్గొన్నారు.

అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ సిద్దిపేటలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు ఎంతో కృషి చేశారని అలాగే సిద్దిపేట పట్టణం ఆధ్యాత్మికకు యజ్ఞ యాగాదులకు ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి మన సిద్దిపేట అన్నారు. ప్రాచీన దేవాలయం అయినప్పటికి ఆలయ ముఖ మండపం లోనే రావిచెట్టు ఉండటం వల్ల ఈ ఆలయానికి రావిచెట్టు హనుమాన్ దేవాలయం అన్నారు. ఈ దేవాలయానికి ఎన్నో వేల మంది భక్తులు వచ్చి సేవించుకొని తరిస్తారని అలాంటి ఆలయానికి ఒక గోశాల ఉండడం చాలా విశేషమన్నారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆలయ ప్రధాన అర్చకులు వైద్య కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్, శ్రీను, ఇల్లెందుల రాజశేఖర్, అయిత రామకృష్ణ, నాగరాజు, సోమ శ్రీకాంత్, జిల్లా శ్రీనివాస్, బచ్చు రమేశ్, మేర సత్తయ్య, ఊదర మణిదిప్‌రెడ్డి, తిప్ప రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News