Monday, December 23, 2024

తొలకరి వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

- Advertisement -
- Advertisement -

బాసర : రైతులు తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు రైతులు దుక్కులను సిద్ధం చేసుకున్నారు. ఓ వైపు ఇంకా ఎండలు దంచి కొడుతున్నాయి. వరణుడి కరుణ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు దాటినా తొలకరి పలకరించడంతో వేసవి తాపానికి ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క చినుకు కూడా రాలకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు.

ఇంతవరకు సరైన వర్షాలు పడనందున రైతులు తొందరపడి పత్తి విత్తనాలు నాటవద్దని బాసర వ్యవసాయ అధికారులు గురువారం తెలిపారు. వర్షాకాలం సాగుకు సన్నద్ధం కావాలంటే సుమారు 60 మి. మీ నుంచి 70 మి. మీ వర్షం పడినప్పుడు మాత్రమే భూమి చల్లబడుతుందని అప్పటి వరకు రైతులు పొడి దుక్కిలో విత్తనాలు నాటరాదని సూచించారు. తొందరపడి నాటిన 4 నుంచి 5 రోజుల్లో వర్షం పడకపోతే భూమిలో ఉన్న పత్తి గింజనలు మట్టి పురుగులు పెంకు పురుగులు తింటాయన్నారు. రైతులు నష్టపోకుండా సూచనలు పాటించాలని కోరారు.
ప్రారంభమైన ఖరీఫ్ పంట సాగు పనులు
ఖరీప్ పంటల సాగు పనులు ప్రారంభమయ్యాయి. ముథోల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో రైతులు ఖరీప్ పంటల సాగుకు భూములను సిద్ధ్ంద చేస్తున్నారు. మండల వ్యాప్తంగా రైతులు పత్తి, సోయా, వరి పంటలతో పాటు కంది, మినుము, పెసర, పంటలను సాగు చేస్తారు. రై తులు విత్తనాలు , ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. తొలకరి జల్లు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే వ్యవసాయ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా విత్తన ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అదేవిధంగా విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అధికారులునకిలీ విత్తనాల బెడదను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నైరుత రుతపవనాల రాక ఆలస్యం కావ డంతో రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసేందుకు అన్ని రకాలుగా రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు రైతులకు రెండు పర్యాయాలు వర్షాలు కురిసన తర్వాతనే విత్తనాలు వేయాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News