Thursday, December 19, 2024

అగ్నిప్రమాదంలో మామిడి, జామాయిల్ చెట్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ : మండల పరిధిలోని టేకులబంజర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మామిడి, జామాయిల్ చెట్లతోపాటు రెండుబోర్లు దగ్ధమైన సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. ఈ ప్రమాధంలో ఇద్దరు రైతులకు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల ప్రకారం టేకులబంజర్ గ్రామానికి చెందిన గుగులోత్ వీర్యనాయక్, గుగులోత్ కృష్ణలకు చెందిన 15 ఎకరాల మామిడితోట ఉంది.

ఆ తోటలోని 40 మామిడిచెట్లు, మరో రెండెరాల్లో జామాయిల్ చెట్లు, రెండు బోరుబావులకు సంబంధించిన విద్యుత్ బోర్డులు, విద్యుత్ వైర్లు, పైపులు కాలిపోవడంతో ఇద్దరు రైతులకు రూ.4 లక్షల ఆస్థినష్టం వాటిల్లింది. అయితే పక్కనే ఉన్న వరిపొలంలో ఒక రైతు గడ్డి కాలబెట్టేందుకు నిప్పు పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

గాలికి ఎగిసిన మంటలతో మామిడి, జామాయిల్ చెట్లకు నిప్పంటుకున్నట్లు చెప్తున్నారు. వారంరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పెద్దలు పంచాయితీ నిర్వహించినట్లు సమాచారం. అయితే పంచాయతీలో అంగీకారం కుదరకపోవడంతో బాధితరైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అగ్నిప్రమాద సంఘటన వెలుగుచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News