కోయిలకొండ : మహిమాన్వితమైన శ్రీరామకొండ క్షేత్రానికి ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తజన సంద్రం పొటెత్తింది. ఉదయం 3 గంటల నుండి సా యంత్రం వరకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులు రాష్ట్ర నన్ను మూలల నుండి తరలివచ్చి శ్రీరామ పాదాన్ని దర్శించుకున్నారు. రామనామ తారక మంత్రాన్ని పటిస్తూ భక్తులు పరవంశించిపోయారు. ఉదయం కొండపై గల శ్రీరామ పాదానికి అర్చకులు రఘు రామాచారి, డిఎం రాఘవేంద్రరావులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామ పాదానికి ఉదయం పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, నైవేద్యం, మహ మంగళహారతి, పూజా కార్యక్రమాలను కొనసాగించారు. ఉదయం నుండి మహిమాన్వితమైన శ్రీ రామ కొండపైకి ఆదివారం అమావాస్య ఈ సందర్భంగా శ్రీరామ కొండపైకి చేరుకొని శ్రీరామ పాదాలు దర్శించుకు ంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ వి శ్వాసం.
రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు కొండపైకి వ్యయప్రయాసలతో చేరుకొని స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీరామ పాదాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. శ్రీరామకొండ చైర్మన్ రవీందర్‌రెడ్డి నవోదయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను కొనసాగించడం జరిగింది. మహబూబ్‌నగర్ రూరల్ సీఐ రాజేశ్వర్‌గౌడ్ , కోయిలకొండ ఎస్‌ఐ సతీష్‌తో పాటు హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్‌లోకి వచ్చినటువంటి పోలీసు సిబ్బంది శ్రీరామకొండ భక్తులకు ఎలాంటి అవ్వాల్సిన సంఘటన జరగకుండా ప్రత్యేక శ్రద్ద వహించి దర్శనం అయ్యేలా చూశారు. స్థానిక సర్పంచ్ కృష్ణయ్య , గ్రామ పంచాయతీ సిబ్బందితో పరిశుద్ద పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు వెంకటనారాయణ, మనోజ్, లక్ష్మయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.