Wednesday, January 22, 2025

ఇంటింటికి మంచినీరు అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: ఇంటింటికి మంచినీరు అందించాలనే సంకల్పంతోనే సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ పథకాన్ని రూప కల్పన చేశారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నల్లబెల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంటింటికి మంచినీళ్లు అందించాలనే సంకల్పంతో 2015లో మిషన్ భగీరథ పథకాన్ని మొదలు పెట్టి క్రమశిక్షణ, నిబద్ధతతో అనతి కాలంలోనే పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆదివాసీ గూడాలతో పాటు అన్ని గ్రామాలు, తండాలకు శుద్ధి చేసిన జలాలను ప్రతీ ఇంటింటికి ప్రతీ రోజు ఒక మనిషికి 100 లీటర్ల చొప్పున తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు.

తెలంగాణ మంచినీటి సరఫరా వ్యవస్థను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం 2022లో నిత్యం నీటి సరఫరా చేసే మొదటి రాష్ట్రంగా అవార్డు ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ పథకం ద్వారా నర్సంపేట నియోజకవర్గంలో రూ. 128 కోట్లతో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో తాగునీటి కోసం చేపట్టిన అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. నర్సంపేట డివిజన్‌లోని 378 హాబిటేషన్‌లో ఇప్పటికే 221 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు ఉండగా కొత్తగా 291 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లను మంజూరు చేసుకొని నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. అదే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథ వాటర్ సప్లై కోసం 640.31 కి.మీ మేర పైపులైను పనులను పూర్తి చేసుకున్నాం. గతంలో నియోజకవర్గ వ్యాప్తంగా 24,905 ఇళ్లకు గాను ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఉండగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో 40,814 హెచ్‌హెచ్‌ఎస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం మొత్తం నియోజకవర్గంలో 65,719 నల్లా కనెక్షన్లతో తాగునీటిని అందిస్తున్నాం. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ. 90 కోట్లతో మిషన్ భగీరథ పనులను పూర్తి చేసుకోవడం జరిగింది. అర్బన్ మిషన్ భగీరథ పథకం రూ. 38 కోట్లతో నర్సంపేట పట్టణంలో చేపట్టిన తాగునీటి అభివృద్ధి పనులు. నర్సంపేట మున్సిపాలిటీలో శాశ్వత మంచినీటి సమస్యను తీర్చడం కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా కొత్తగా 27 లక్షల లీటర్ల సామర్థం గత నాలుగు వాటర్ ట్యాంక్‌లను నిర్మించడం జరిగింది.

అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 174 కి.మీ పైపులైన్ కనెక్షన్లు ఏర్పాటుచేయడం జరిగింది. ఇంటింటికి నల్లా కనెక్షన్ల కింద మున్సిపాలిటీలోని 8000 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. వీటితోపాటు నర్సంపేట పట్టణంలో ఆర్‌డబ్లూఎస్ డివిజన్ ఇంజినీరింగ్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేసుకొని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఊడ్గుల ప్రవీణ్‌గౌడ్, ఎంపీటీసీ, సర్పంచ్, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు, క్లస్టర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News