Monday, December 23, 2024

కాకతీయుల చరిత్ర చాలా గొప్పది

- Advertisement -
- Advertisement -

ఖిల్లా వరంగల్: దేశంలోనే కాకతీయ రాజుల చరిత్ర చాలా గొప్పదని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలోని టూరిజం ప్రదేశాల్లో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే వరంగల్ జిల్లాలోని కాకతీయుల కోటగా పిలువబడే చారిత్రాత్మక ప్రదేశం వరంగల్ ఖిల్లా ఫోర్టును తెలంగాణ టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదివారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఫోర్ట్ మొత్తం తిరుగుతూ కాకతీయుల కట్టడాలను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో గంటకు పైగా మాట్లాడి ఫోర్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వరంగల్ ఖిల్లా సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, వరంగల్ ఖిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని అక్కడి సిబ్బందికి భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News