Saturday, April 12, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బీజపూర్ : ఛత్తీస్‌గఢ్ బీజపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేసి వారి నుంచి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతాబలగాలు పుసనూర్ గ్రామం వద్ద శుక్రవారం ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి టిఫిన్ బాంబు స్వాధీనం చేసుకున్నారు. వీరు మందుపాతరలు అమర్చి పేల్చివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఏరియాలో మావోయిస్టు పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. తమకు సిపిఐ (మావోయిస్టు)తో సంబంధం ఉందని దర్యాప్తులో భద్రతా దళాలకు వీరు చెప్పినట్టు బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News