- Advertisement -
తానూర్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం మంచినీళ్ల పండగను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ విఠల్ మాట్లాడుతూ మిషన్‌భగీరథ ద్వారా గ్రామాలలో ఇంటింటికి నీరు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల హయంలో తాగునీటి కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలంగాణ వచ్చాక తాగునీటి సమస్య తీరిందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి తండాల్లో నీళ్లు మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విఠల్, పంచాయతీ కార్యదర్శి జలాంసింగ్, లక్ష్మణ్, బీంరావు, పవర్ వెంకటేష్, రాజు నగరో పవార్, భగవాన్ తదితరులు ఉన్నారు.
- Advertisement -