Friday, December 20, 2024

శివసేన ఆవిర్భావదినోత్సవం షిండే, ఉద్ధవ్ పోటాపోటీ కటౌట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో శివసేన ఆవిర్భావ దినోత్సవం సోమవారం జరుగుతున్న దశలో ఇప్పుడు పోస్టర్ల వార్ నెలకొంది. బాలాసాహెబ్ థాకరే స్థాపించిన పార్టీ తమదంటే తమదని ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండ్‌ల నడుమ సాగుతోన్న రాజకీయ, న్యాయస్థానపరమైన, భావోద్వేగభరిత పోరు ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. ముంబైలోని పలు కూడళ్లలో ఇరు వర్గాల నేతలతో కూడిన పోస్టర్లు పోటాపోటీగా వెలిశాయి. శివసేన వారసత్వం, రాజకీయ ఆధిపత్యం తమదంటే తమదని తెలియచేసుకుంటూ ప్రదర్శితం అవుతోన్న కటౌట్లలో పరస్పర దూషణల నినాదాలు కూడా చోటుచేసుకున్నాయి.

ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదానికి న్యాయస్థానం ఓ పరిష్కారం ఇవ్వనే ఇచ్చింది. రెండువర్గాలకు వేర్వేరుగా పేర్లు , గుర్తులు కేటాయించారు. అయితే జెండాలు, ఎన్నికల గుర్తులతో నిమిత్తం లేకుండా నిజమైన శివసేన తమదంటే తమదని చిత్రీకరించుకుంటూ ముంబై పశ్చిమ, సెంట్రల్ ముంబై, సౌత్ ముంబై ప్రాంతాలలో రెండు వర్గాల గాఢమైన కాషాయ, నారింజ రంగు పోస్టర్లు, జెండాలతో కన్పించాయి. సోమవారం షిండే సభ గోరేగాన్‌లో ఉంది, ఉద్ధవ్ తమ సభను సియాన్‌లోని షణ్ముఖానంద హాల్‌లో ఏర్పాటు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News