Monday, December 23, 2024

అనుమానాస్పద స్ధితిలో వ్యక్తి

- Advertisement -
- Advertisement -

దండేపల్లి: దండేపల్లి మండలం రాజుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జేతూగూడ గ్రామానికి చెందిన మరుసుకొల్ల కృష్ణ (29) అనుమానాస్పద స్ధితిలో మృతి చెందినట్లు దండేపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మరుసుకొల్ల కృష్ణ ఈ నెల 15న ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లాడు. కృష్ణ డ్రైవర్‌గా పని చేయడం వల్ల వృత్తి పరంగా డ్రైవింగ్‌కు వెళ్లాడని ఇంట్లో అనుకున్నారు. ఈ నెల 17న కుంటాలగూడ కట్ట గ్రామ శివారులో సదర్రాజుల గుడి లోపల మృతదేహం పడి ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లగా మృతదేహం కని పించింది. మృతదేహంపై ఉన్న బట్టలు, ప్యాంటు, షర్ట్ ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడి సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News