కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 20 మంది అండర్ – 14, అండర్ – 17 విద్యార్థులు జూలై 1,2వ తేదీలలో మహారాష్ట్రలో రూరల్ గేమ్ ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగనున్న క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్న విద్యార్థులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీవారిని అభినందించారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని, మన రాష్ట్రానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, నిజాంపేట్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, నాయకులు మహ్మద్ రఫీ, హన్మంతరావు, మురళి యాదవ్, ట్రైనర్ అతియా సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి క్రీడా పోటీలకు నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -