Sunday, December 22, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో 400 మత్తు ఇంజక్షన్లు పట్టివేత

- Advertisement -
- Advertisement -

మైలార్‌దేవ్‌పల్లి: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా మత్తు ఇంజక్షన్లు పట్టుకున్నారు. 400 మెఫెంటెర్మెన్ సల్ఫేట్ ఇంజక్షన్స్‌ను సీజ్ చేశారు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ఎన్‌డిపిఎస్ కింద కేసు నమోదు చేసి జిమ్ ట్రైనర్ సతీష్, రాహుల్, సోహెల్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మత్తు ఇంజక్షన్స్ ఎక్కడి నుంచి తీసుకవస్తున్నారా?… ఎవరెవరికి అమ్ముతున్నారు. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రదారి ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మల్కపేట రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News