Saturday, December 21, 2024

పవన్ రాజకీయ వ్యభిచారి: ద్వారంపూడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని వైసిపి ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నమ్ముకున్నవాళ్లను పవన్ నట్టేట ముంచారని దుయ్యబట్టారు. జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తనని విమర్శించే స్థాయి పవన్‌కు లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి అని, రాజకీయ వ్యభిచారి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎవరిని ఉద్దరించడానికి జనసేన పార్టీనికి పవన్ స్థాపించారో అందరికి తెలుసునన్నారు.

Also Read: ఇద్దరు పిల్లలను వీపుకు కట్టకొని బావిలో దూకిన తండ్రి

జనసేన పార్టీ ఎజెండా ఏంటని ద్వారంపూడి ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబుతో బేరం కుదరక రోడ్లపైకి వచ్చారని, పవన్ పెట్టే మీటింగ్‌ల కంటే పెద్ద మీటింగ్‌లు పెట్టగలమన్నారు. పవన్ రాజకీయపరంగా జీరోగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాకినాడలో అన్ని సామాజిక వర్గాలు కలిసి తనని ఎంఎల్‌ఎగా గెలిపించాయన్నారు. ప్యాకేజీలు, సీట్లు ఒప్పందం కుదరకుంటే పవన్ రోడ్డు మీదకు వస్తాడని, పవన్ ఎంఎల్‌ఎ కావాలన్నా… సిఎం కావాలన్నా అది సినిమాల్లోనే సాధ్యమవుతుందన్నారు. పవన్ తనపై చేసిన అసత్య ఆరోపణలను నిరూపించాలని ద్వారంపూడి సవాలు విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News