నాగర్‌కర్నూల్ : అత్యవసర సమయాల్లో ప్రాణాలను తిరిగి తెచ్చే రక్తాన్ని దానంగా ఇవ్వడం మహాదానమని జిల్లా ఎస్పి కె. మనోహర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌం డ్‌లో జిల్లా ఎస్పి మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ యువత రక్తదానంలో ముం దుండాలని, రక్తదానం మరొకరికి ప్రాణ దానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఒక వ్యక్తి పది మంది ప్రాణాలు కాపాడే అద్భుత అవకాశం రక్తదానం వల్ల లభిస్తుందన్నారు. రక్తదానం వంటి బృహత్తర కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. రక్తదానం పట్ల ప్రజలలో ఉన్న అపోహలు తొలగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్సి సిహెచ్ రామేశ్వర్, ఏఆర్ అడిషనల్ ఎస్పి భరత్, నాగర్‌కర్నూల్ సిఐలు ఎస్సైలతో పాటు 60 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.