Monday, December 23, 2024

కేంద్ర పాలనలో జమ్మూ కశ్మీరుకు ఐదేళ్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: ప్రజా ప్రభుత్వం లేకుండా సోమవారంతో ఐదేళ్లు పూర్తయిన జమ్మూ కశ్మీరులో వెంటనే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేశారు.

2019 ఆగస్టు 15న జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీరు, లడఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(యుటి) విభజించింది. సంకీర్ణ ప్రభుత్వానికి బిజెపి మద్దతును ఉపసంహరించుకోవడంతో పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తి 2018 జూన్ 19న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

జమ్మూ కశ్మీరు మొదలైన చోటే భారత్‌లో ప్రజాస్వామ్యం అంతమైందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం తమ రక్తనాళాలలో ఉందని, అది తమ సంస్కృతని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది, భారత్ ప్రజాస్వామ్యానికి ఆలయం వంటి మాటలన్నీ గొప్పగా ఉంటాయని, అంతర్జాతీయ సమాజం చీత్కరించుకుంటోందని ఆయన పేర్కొన్నారు. నేటితో జమ్మూ కశ్మీరు 5 ఏళ్ల కేంద్ర పాలనను పూర్తి చేసుకుందని, జమ్మూ కశ్మీరు మొదలైన చోట ప్రజాస్వామ్యం అంతమైందని ఆయన ట్వీట్ చేశారు.

ఇలా ఉంగా బిజెపితో సహా వివిధ రాజకీయ పార్టీలు జమ్మూ కశ్మీరులో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించాలని అవి డిమాంవ చేశాయి. 2014లో చివరిసారి జమ్మూ కశ్మీరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News