Monday, December 23, 2024

పచ్చదనాన్ని తీసుకొచ్చిన హరితహారం : ఎమ్మెల్యే మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

అల్వాల్ : హరితహారం కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ వెంకుస కాలనీలో తెలంగాణ దశాబ్ది పార్కును ప్రారంభించి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అల్వాల్ సర్కిల్ కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, శాంతి శ్రీనివాసరెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ డిప్యూటీ కమిషనర్ నాగమణి ఉద్యానవన శాఖ అధికారిని ప్రవీన్ పాల్గొని పార్కుని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. కెసిఆర్ ఒక్కమాటతో ప్రజలు ఉద్యమంలో చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాలు సైతం పచ్చదనంతో వెల్లివేరుస్తున్నాయని పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం నిధుల కొరత లేకుండా చూస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఈ మహేష్, కాలనీవాసులు రామనాథం, పవన్, శ్రీధర్, విజయకుమార్, ఉమాపతి, మోహనకృష్ణ, డివిజన్ ప్రెసిడెంట్ బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఢిల్లీ పరమేష్, శోభన్, వివి రావు, కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News