Tuesday, December 24, 2024

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి

- Advertisement -
- Advertisement -
  • హరితహారం దేశంలోనే బృహత్తర కార్యక్రమం
  • రితనిధిని ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్
  • హరితోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

పెద్దేముల్: ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నాగులపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంపొందించేందుకు సిఎం కెసిఆర్ విశేష కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే హరితహారం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా పేరొందిన హరితహారం కార్యక్రమం ప్రపంచానికే తలమానికగా నిలుస్తుందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి హరితనిధిని ఏర్పాటు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి అనురాధ, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ మట్ట భాగ్యలక్ష్మి, ఎంపిటిసి సురేఖ, ఎంపిటిసిల ఫోరం ఉపాధ్యక్షుడు వెంకటేశ్ చారి, రైతు కమిటీ అధ్యక్షుడు జయరాం నాయక్, డీఎస్పీ శేఖర్ గౌడ్, ఎఫ్‌ఆర్‌ఓ శ్యాంసుందర్ రావు, సీఐలు రాంబాబు, రాజేందర్ రెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగజ్యోతి, ఎంపిడిఒ లక్ష్మప్ప, తహశీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, ఎఫ్‌ఎస్‌ఓ మమతారెడ్డి, ఏపీఓ లక్ష్మీదేవి, ఏపీఎం బాలయ్య, సీనియర్ నాయకులు రమేశ్, మట్ట శ్రీనివాస్, జితేందర్ రెడ్డి, నరేశ్ రెడ్డి, డీవై ప్రసాద్, పి.శ్రీనివాస్ రెడ్డి, సీహెచ్ రాములు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News