కుంటాల : రైతులకు నిరంతరం రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. సోమవారం కుంటాల మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నిరంతరం అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని రైతులు అధైర్య పడి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే తెలిపారు. జొన్నల కొనుగోలు కేంద్రాల్లో క్వింటాళుకు రూ. 3 వేల చొప్పున కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కొనుగోలు కేంద్రాన్ని సొసైటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాకుండా వరి ధాన్యం మొక్కజొన్న రైతులకు డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయని రైతులు ఆందోళన చెందవద్దని రాబోయే రోజుల్లో రైతుల అభివృద్ధ్దికి మరింత కృషి చేస్తానన్నారు. రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే జొన్నలను విక్రయించుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గంగామణి బుచ్చన్న, ఎంపిడివో దేవెందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, సొసైటి చైర్మెన్ సట్ల గజ్జారాం, స్థానిక సర్పంచ్ సమత వెంకటేష్, సర్పంచ్‌లు, దాసరి కిషన్, పెదకాపు మల్లేష్, లక్ష్మీ రమేష్, ఎంపిటిసి మధు, ఏఎంసీ డైరెక్టర్లు గైని సాయి, బొంతల పోశెట్టి, సోషల్‌మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంట ధశరథ్, స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు జుట్టు మహేందర్, సబ్బిడి గజేంధర్, బోగ లక్ష్మణ్, రఘు, గజ్జారాం రమేష్, తదితరులు పాల్గొన్నారు.