Monday, December 23, 2024

26 నుంచి రైతుబంధు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్ర భుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 26 నుంచి విడుదల చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సిఎం కెసిఆర్ ఆదేశించారు. భూ ములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం, పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News