Monday, December 23, 2024

మంచి మనసు చాటుకున్న మాదాడి కృష్ణారెడ్డి

- Advertisement -
- Advertisement -
సర్కారు బడిలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

హైదరాబాద్: సామాజిక బాధ్యతలో భాగంగా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఎంకేఆర్ డెవలపర్స్ అధినేత మాదాడి కృష్ణారెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాలలో భాగంగా నేడు జరగనున్న విద్యా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఆలికోల్ తండా గ్రామపంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో స్థానిక సర్పంచ్ రాజు నాయక్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాదాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ వివిధ సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నదని తెలిపారు.

త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో స్థానిక సర్పంచ్ రుద్రవరం కుమారస్వామి, అదే మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఎంకేఆర్ డెవలపర్స్ సంస్థ నోటు పుస్తకాలు పంపిణీ చేయడం పట్ల అలికోలి తండా సర్పంచ్ రాజు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News