Friday, November 15, 2024

కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: గ్రీనరీని పెంచి కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆద్వర్యంలో బుల్ సెమన్ సెంట ర్ పట్టణ ప్రకృతి వనంలో సోమవారం హరిత దినోత్సవం ఘనంగా జరిగింది.

హరితోత్సవంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ , అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ, కమీషనర్ సేవా ఇస్లావత్, కార్పోరేటర్లు, ఫారెస్టు అధికార సిబ్బంది, నగరపాలక సంస్థ హరితహారం అధికారులు, సిబ్బంది విద్యార్థులతో కలిసి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి నీరు పోశారు.

ఈ సందర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ గ్రీన్ సిటీ గా మార్చడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ప్రతి ఏటా హరితహారంలో 6 లక్షల మొక్కలను నాటి సంరక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా హరితహారం కోసం 10 శాతం గ్రీన్ బడ్జెట్ ను కేటాయించి హరితహారం ను విజయవంతం చేస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా 11 నర్సరీలను ఏర్పాటు చేసి వచ్చే హరితహారంకు ఆరు లక్షల మొక్కలు సిద్దం చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ కు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ఉత్తమ అవార్డు ను ప్రకటించి అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే హరితహారంకు కూడా మరో 6 లక్షల మొక్కలను నర్సరీల్లో సిద్దంగా ఉంచామన్నారు. కొత్త మున్సిపల్ చట్టం లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ ను హరితహారంకు ఖర్చు చేసి లంగ్స్ బేస్ పెంచడం జరుగుతుందన్నారు.

నగరంలో పూర్తి స్థాయి గ్రీన్ కవర్ పెంచేందుకు హరితహారంకు ప్రత్యేక అధికారులను సిబ్బంది ని నియమించి నాటిన ప్రతి మొక్కను బ్రతికించడం జరుగుతుందన్నారు. వచ్చే హరితహారంలో నగర ప్రజలకు పంపిణీ చేసే 6 మొక్కలతో పాటు వారి రాశుల పేర్లకు తగిన మొక్కలను కూడ అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరిశంకర్, కమీషనర్ సేవా ఇస్లావత్, స్థానిక కార్పోరేటర్ బోనాల శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, అధికారులు సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News