Monday, December 23, 2024

అమెరికా చైనా సర్దుబాట్లు..

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్‌ను కలుసుకున్నారు. చైనా, అమెరికాల వివాదాస్పద వ్యవహారాల నడుమ బ్లింకెన్ చైనాకు రావడం కీలక అంశం అయింది. తాను అమెరికా విదేశాంగ మంత్రితో భేటీ అయినట్లు ఆ తరువాత చైనా నేత తెలిపారు. రెండుదేశాల ఉన్నతస్థాయి దౌత్యవేత్తల నడుమ విస్తృతస్థాయి సంప్రదింపుల తరువాత కొన్ని నిర్థిష్ట అంశాలపై పరస్పర అవగాహన కుదిరిందని చైనా అధినేత తెలిపారు. చైనాలో రెండు రోజుల పర్యటన తుదిరోజున బ్లింకెన్ జిన్‌పింగ్‌ను కలిశారు. ఈ దశలోనే ఇరుదేశాల మధ్య సర్దుబాట్లు కుదిరినట్లు చైనా నేత తెలియచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే ఏఏ అంశాలపై అవగావహన కుదిరిందనేది తెలియచేయలేదు. బ్లింకెన్‌తో చర్చలు అత్యంత రహస్యంగా , చాలా లోతుగా జరిగాయని అధికారులు వెల్లడించారు. చైనా ప్రముఖ దౌత్యవేత్త , విదేశాంగ వ్యవహారాల శాఖ సంచాలకులు వాంగ్ యీ, విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ మధ్య చర్చలు బాగా జరిగినట్లు స్వయంగా చైనా అధినేతనే చెప్పారు. సమస్యలపై సరైన సంప్రదింపులు జరగాల్సి ఉందని ఇంతకు ముందు బాలి ఇతర చోట్ల జరిగిన పలు ప్రపంచ స్థాయి సదస్సు నేపథ్యంలో కుదిరిన అంగీకారం మేరకు ఇప్పుడు బ్లింకెన్ ఇక్కడికి రావడం కీలకం అయింది. భారత ప్రధాని మోడీ రెండు రోజుల్లో అమెరికాలో తొలి అధికార పర్యటనకు వెళ్లుతున్న దశలో చైనాకు అమెరికా విదేశాంగ మంత్రి వెళ్లడం మరో విశేష పరిణామం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News