బులవాయో: ఐసిసి వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో 175 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన యుఎఇ 39 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన యుఎఇని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ మహ్మద్ వసీం (39), వికెట్ కీపర్ అరవింద్ (39), రమీజ్ షాజాద్ (26), అలి నసీర్ (34) తప్ప మిగతావారు విఫలమయ్యారు.
ప్రత్యర్థి జట్టు బౌలర్లలో వనిందు హసరంగా 24 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను ఓపెనర్లు పాథుమ్ నిశాంక (57), కరుణరత్నె (52) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. మరోవైపు కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంకలు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ధాటిగా ఆడిన కుశాల్ మెండిస్ పది ఫోర్లతో 78 పరుగులు చేశాడు. సమరవిక్రమ వేగంగా 73 పరుగులు సాధించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన అసలంక 23 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 48 పరుగులు చేశాడు. హసరంగా కూడా వేగంగా 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో లంక స్కోరు 355 పరుగులకు చేరింది.