Monday, November 25, 2024

భవిష్యత్తు తరాల కోసం హరితహారం

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: తరాల కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటి సంరక్షించి ఆటవీ శాతాన్ని పెంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో సోమవారం హరితోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ తైబ్రివాల్, ఎస్పీ సురేష్‌కుమార్, జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి హాజరై మొక్కలు నాటారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం నెలకొందని అన్నారు. గత 9 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సాధించిన విజయాలను ప్రజలందరికి తెలిసేందుకు ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రజలందరు కలిసి రావాలని తెలిపారు.

జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ గత 9 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా 20 అటవీ నర్సరీలలో ప్రతి సంవత్సరం 20 లక్షల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, కోతులు, ఇతర అటవీ జంతువుల పునరావాసం కోసం 422 హెక్టర్లలో పండ్ల జాతీ మొక్కలు నాటించే కార్యక్రమాలు, అడవిలో సున్నితమైన ప్రాంతాలలో పటిష్ట రక్షణ కొరకు వాచ్ టవర్ల ఏర్పాటు, అటవీ ప్రాంతాలలో సిబ్బంది నివాసం ఉండేందుకు క్వార్టర్ల నిర్మాణం, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, తునికాకు సేకరణ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ రూపంలో తిరిగి సేకరణదారులకు రాయితీ చెల్లించడం జరిగిందని తెలిపారు.

అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటిలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, వెదురు బోంగులతో తయారు చేసిన ఉత్పత్తులను, పరికరాలను ప్రదర్శించారు.

అనంతరం ఆటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే తెలంగాణ చరిత్ర, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై చేసిన ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపిపి మల్లికార్జున్, ప్రాథమిక సహాకార సంఘం అద్యక్షులు అలిబిన్ హైమద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాదావేణి మల్లేష్, కాగజ్‌నగర్ అటవీ అధికారి, జిల్లాలోని రేంజ్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News