Friday, November 22, 2024

అదనపు కట్నం వేధింపులకు ముగ్గురు బలి

- Advertisement -
- Advertisement -

భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని జివిఆర్ కాంపౌండ్‌లో నివాసం ఉం టున్న సౌందర్యను తల్లిదండ్రులు ఉప్పల్‌లో నివాసముంటున్న గణేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి నిత్య, నిదర్శన్ అనే ఇద్దరు కవల పి ల్లలు ఉన్నారు. అయితే వివాహమైన దగ్గర నుంచి సౌందర్యను ఆమె భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భార్యభర్తలకు తరచూ గొడవలు జరుగుతుండడంతో సౌందర్య 15 రోజలు క్రితం బన్సీలాల్‌పేటలోని జివిఆర్ కాంపౌండ్‌లో ఉండే తల్లి ఇంటికి వచ్చింది.

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్న సమయంలో ఆమె ఉంటున్న భవనంలోని ఎనిమిదో అంతస్థు నుంచి తన ఇద్దరు పిల్లలను కింద పడేసి అనంతరం ఆమె కూడా కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న గాంధీనగర్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా తల్లి, ఇద్దరు పిల్లలు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతం అంత శోకసంద్రంగా మారింది. సౌందర్య భర్త గణేష్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని అతనిని కఠినంగా శిక్షించాలని మృతిరాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మృతిరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ మోహన్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News