Monday, December 23, 2024

నారపనేనిపల్లిలో నంది విగ్రహం చోరీ

- Advertisement -
- Advertisement -

వైరా : ఓ దేవాలయంలో నంది విగ్రహం చోరీకి గురైన సంఘటన వైరా మండల పరిధిలోని నారపనేనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం నారపనేనిపల్లిలోని శ్రీ చంద్రశేఖర దేవాలయంలో పురాతన నంది విగ్రహం ఉంది. శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నంది విగ్రహం వద్ద నిమ్మకాయలతో పూజలు నిర్వహించి నంది విగ్రహన్ని దొంగలించారు.

అంతేకాకుండా దేవాలయ తలుపులకు ఉన్న తాళాలను సైతం పగులగొట్టి ఈ చోరీకి పాల్పడ్డారు.దేవాలయంలో నంది విగ్రహం చోరీకి గురుకావటంతో స్థానికులు భయందోళనకు గురౌతున్నారు. విషయం తెలుసుకున్న వైరా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News