Monday, November 18, 2024

మదర్ డైరీ పార్కును సుందరీకరిస్తాం : ముఠాగోపాల్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బాగ్‌లింగంపల్లి ఎంఐజి..2 కాలనీలో నిరుపయోగంగా ఉన్న మదర్ డైరీ పార్కును ఆధునీకరణతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముందకొచ్చారు. ఈ మేరకు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పారావు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రెడ్డి, రఫీ అహ్మద్ నాయకత్వంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను కలిసి మదర్ డైరీ పార్కును సుందరీకరించి, కాలనీ వాసులకు అం దుబాటులోకి తీసుకురావాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ జీహెచ్‌ఎంసీ డిఎంసి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, అర్బన్ బయో డైవర్శిటీ అధికారులతో మాట్లాడి మదర్ డైరీ పార్కును సుందరీకరణ చే సేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో ఎ మ్మెల్యే ఆదేశాల మేరకు రెండ్రోజుల క్రితం మదర్ డైరీ పార్కులో బోర్‌వెల్ నిర్మాణం ప్రారంభం కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భా గంగా సోమవారం హరితోత్సవం పురస్కరించుకుని గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే ముఠా గో పాల్ జీహెచ్‌ఎంసీ డిఎంసీ డాక్టర్ తిప్పర్తి యా దయ్య, ఇతర అధికారులతో కలిసి మొక్కలు నా టారు.

ఈ సందర్భంగా మదర్‌డైరీ పార్కుకు తెలంగాణ దశాబ్ది పార్కుగా నామకరణం చేశారు. అనంతరం కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ముఠా గో పాల్ మాట్లాడుతూ ఇప్పటికే సుందరయ్య పార్కులో రూ. 1.20 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు చేశామని అన్నారు. తెలంగాణ దశాబ్ది పార్కులో కూ డా కావాల్సిన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కల్పనకు కృషి చేస్తా నని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా హరితహా రం నిర్వహించడంతో ప్రపంచం లోనే హైదరాబాద్ మహానగరం ఉత్తమ గ్రీన్ సిటీగా ఎంపికైనట్టు తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పవన్ కుమార్, యూబిడి ఏఈ భాస్కర్, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ, బిఆర్‌ఎస్ డివిజ న్ అధ్యక్షులు రావులపాటి మోజస్, ప్రధానకార్యదర్శి మన్నె దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులు బబ్లూ, సుందరయ్యపార్కు వాకర్స్‌క్లబ్ అధ్యక్షులు ఎస్. రమేష్ రెడ్డి, నిరంజన్, సంతోష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News