Monday, December 23, 2024

చెట్లే మానవ మనుగడకు జీవనాధారం : ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్ధి చేయడమే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ హారితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సహల్లో భాగంగా హారితోత్సవం కార్యక్రమంలో భాగంగా కా మినేని ఫ్లైఓవర్ క్రింద ఆక్సిజన్ పార్కులో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కాకుండా భవిష్యత్తు తరాలకు భూగోళాన్ని పరిరక్షించడం పెరుగుతున్న జనాభాతో అవసరాలు పెరిగి అడవులు కనుమరుగువుతున్నాయని, దీంతో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షపాతం తగ్గిపోతుందన్నారు.

2015లో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అటవీ వి స్తీర్ణం 24శాతం నుంచి 33శాతానికి పెంచే లక్షంతో ప్రభుత్వం 2015—2016 హరితహారానికి అంకురార్పణ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్షంతో ముందుకు సాగుతుందని, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 26 రకాల మొక్కలను మొత్తం 36,000 మొక్కలు కా మినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ క్రింద నాటడం జరుగుతుందన్నారు. ఇరువైపులా పెద్ద జాలీలు ఏర్పాటు చేసే ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను జాలీల మీ దికి పాకే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అస్తమా, దగ్గు ఉన్నవారు ఈ పార్కులో వాకింగ్ చేయడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో మూడు సర్కిళ్ల డీసీలు మారుతి దివాకర్, హరికృష్ణయ్య, సురేందర్‌రెడ్డి, డి.డి రాజ్‌కూమార్ మేనేజర్ మేధ , మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మల్లారెడ్డి , రా హుల్‌గౌడ్, రాజిరెడ్డి, నాగరాజు , జగదీష్‌యాదవ్, రఘువీర్‌రెడ్డి , శ్వేతారెడ్డి , రోజారెడ్డి, రంగేశ్వరిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News