వర్ధన్నపేట(పర్వతగిరి): తెలంగాణ రాష్ట్ర హరిత ప్రధాత సిఎం కెసిఆర్ అని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట మండలం కట్య్రాలలో నిర్వహించిన హరితోత్సవంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మొక్కలను నాటారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాదు.. పర్యావరణ సమతూల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు. వాతావరణ సమతుల్యత ఉండాలంటే 33 శాతం అడవులు ఉండటం ఒక్కటే మార్గమని నమ్మిన కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
ఇందులో ప్రభుత్వాధికారులు, ప్రజలు, పార్టీ ప్రతినిధులు, ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యంతో నేడు తెలంగాణ పచ్చదనంతో పరిడవిల్లుతుందన్నారు. పట్టణాలు, గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేసి ఒక ప్రణాళికతో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు వెళ్లడించారు. ప్రతీ గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటుతో పాటు అనువైన చోటల్లా విరివిగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. తాజాగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో తెలంగాణకు హరితహారం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం అడవులు పెరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అటవీ శాఖాధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
* హసన్‌పర్తిలో.. ప్రతీ ఒక్కరూ మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని బైరాన్‌పల్లి సర్పంచ్ కుందూరు సాంబరెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలోని స్మశాన వాటికలో మొక్కలు నాటి హరితోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, రాబోయే తరానికి మంచి వాతావరణం అందించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బండి రజనీకుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ సురేందర్, ఎంపీటీసీ జట్టి మంజుల కుమారస్వామి, కారోబార్ రమేశ్, వాసుదేవరెడ్డి, గ్రామస్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
హరితోత్సవంలో భాగంగా మండలంలోని భీమారం, నాగారం, జయగిరి, సిద్ధాపూర్, హసన్‌పర్తిలోని రైతు వేదికల్లో మొక్కలు నాటారు. కాగా హసన్‌పర్తి రైతు వేదికలో మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ అంచూరి విజయకుమార్, వ్యవసాయాధికారి అడ్లూరి అనురాధ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు క్రాంతికుమార్, కల్పన, భాస్కర్, అనూష, సంధ్య పాల్గొన్నారు.
* మామునూరు(సంగెం)లో.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మామునూరు విద్యుత్ సబ్ స్టేషన్, జక్కలొద్దిలోని మైనార్టీ గురుకుల కళాశాలలో, మామునూరులోని జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాల, మామునూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదేశాల మేరకు స్థానిక కార్పోరేటర్ ఈదురు అరుణ విక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి హనుమాన్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి కర్ణాటక స్వామి, ఎస్సీ సెల్ కార్యదర్శి ఎర్ర అనిల్, డీఈ, ఏఈడీఏ, మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ బిక్షపతి, జ్యోతిరావుపూలే ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, మామునూరు ఏసీపీ కృపాకర్, సీఐలు క్రాంతికుమార్, శ్రీనివాస్, ఎస్సైలు రాజేష్‌రెడ్డి, కృష్ణవేణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
* దుగ్గొండిలో.. మండలంలోని గిర్నిబావిలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హరితోత్సవంలో భాగంగా ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నర్సంపేట ఫారెస్ట్ రేంజర్ నిర్వహించి తెలంగాణ రాష్ట్రం హరితహారం పథకం ప్రగతి అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వైనాల రాజు, ఏటీపీ ప్రభాకర్, డిప్యూటీ వార్డెన్ రాజు, ఉపాధ్యాయులు సుకుమార్, సోమరాణి, కోటి, కిరణ్, రమేశ్, సునీత, అనిత, కృష్ణమూర్తి, కరుణాకర్, సందీప్, లక్ష్మణ్, పీఈటీ సతీష్, బాలకొమురెల్లి, వెంకన్న, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
* గీసుకొండలో.. మండలంలోని కోనాయిమాకుల, గంగదేవిపల్లి, మరియపురం, ఊకల్ గ్రామాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవంలో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీడీఓ వీరేశం, తహసీల్దారు విశ్వనారాయణ, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, ఏపీఓ చంద్రకాంత్, ఆయా గ్రామాల సర్పంచులు గోనె మల్లారెడ్డి, అల్లం బాల్‌రెడ్డి, మూగసాని నాగదేవత, డోలె రాధ, ప్రత్యేకాధికారులు కల్యాణి, రజిత, శ్రీలత, ఎంపీటీసీ వీరారావు, పంచాయతీ కార్యదర్శులు వేణుప్రసాద్, తపస్విని, స్వప్న, శ్రీధర్, ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆరెపల్లి గ్రామంలో ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్ జ్యోతి, మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు పుండృ జయపాల్‌రెడ్డి, బోడకుంట్ల ప్రకాష్, అంకటి నాగేశ్వర్‌రావు, రాజబోయిన రజిత తదితరులు మొక్కలు నాటారు.