Saturday, January 11, 2025

విశాఖలో బాలికపై స్వామీజీ అత్యాచారం?…. ఆ భూముల కోసమే పూర్ణానంద ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ బాలిక తనపై స్వామీజీ అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. స్వామిజీని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజమహేంద్రవరానికి చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో విశాఖపట్నంలో ఉన్న జ్ఞాననాంద ఆశ్రమంలో బాలికను స్థానికులు చేర్పించారు. బాలికకు ఆశ్రమంలో పశువుల పేడ తీయించడంతో పాటు మేత వేయించేవాడు. రాత్రి సమయంలో బాలికను తన రూమ్‌లోకి ఎత్తుకెళ్లి ఆమెపై పూర్ణానంద స్వామీజీ సంవత్సరం నుంచి అత్యాచారం చేస్తున్నాడు. స్వామిజీ తన గదిలో బాలికను బంధించి తీవ్ర చిత్రహింసలకు గురి చేసేవాడు.

ఆశ్రమంలో పని చేసే మహిళ సాయంతో అక్కడి నుంచి బయటకు వచ్చి తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఓ ప్రయాణికురాలి సాయంతో కృష్ణా జిల్లాలో ట్రైన్ దిగింది. అనంతరం సదరు మహిళ బాలికను హాస్టల్‌లో చేర్పించడానికి వెళ్లింది. పోలీసులు నుంచి అనుమతి కావాలంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు వివరాలు అడగడంతో జరిగిన విషయం మొత్తం చెప్పింది. బాలల సంక్షేమ కమిటీ బాలికను విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్ణానంద స్వామిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి స్వామిజీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భూ వివాదం నేపథ్యంలోనే తనను ఇరికించాలని చూస్తున్నారని స్వామీజీ ఆరోపణలు చేశారు. కొందరు నేతలు ఆశ్రమానికి సంబంధించిన భూములపై కన్నేశారని, వారికి లొంగకపోవడంతోనే స్వామీజీని కేసులో ఇరికించారని ఆరోపణలు వెలువడుతున్నాయి.

Also Read: పైసలు పోయినా.. పంట బతకాలె

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News