ములుగు : ఇసుక అక్రమ రవాణా జరగకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ ప్రతిపాదించిన ఇసుక రీచ్‌లను వాజేడు మండలం 3, వెంకటాపురం మండలం 4, మంగపేట మండలంలో 4 ఇసుక రీచ్‌లను తెలంగాణ మైనింగ్ రూల్స్ ప్రకారం డిఎల్‌ఐసి ఆమోదించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేబిల్ సూచనల ప్రకారం సమయపాలన పాటించాలని, ఇసుక లారీ ఓవర్ లోడ్ అరి కట్టుటకు, రాత్రివేళ వాహనాలు రోడ్డు ప్రక్కన పార్కింగ్ వలన యాక్సిడెంట్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను జాయింట్ ఇన్సెక్షన్ చేసి త్వరితగతిన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి ఇసుక పర్మిషన్ వివరాలను అటవీశాఖ వారిని పంపి వారి నుండి క్లియరెన్స్ సూచనలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రామాచారి, టిఎస్‌ఎండిసి పిఓ శ్రీధర్, జె తిరుపతి, డివైఈఈ ఇరిగేషన్ భద్రాచలం, కలెక్టరేట్ సూపర్ ఇండెంట్ విశ్వప్రసాద్, తహసీల్దార్లు శ్రీనివాస్, సర్వర్, సలీం, నాగరాజు, పేసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, సంబంధితశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.