Monday, December 23, 2024

పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

ఘట్‌కేసర్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధ్దికి దాతలు ముందుకు రావాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండలం కాచవాని సింగారం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యా వేడుకలను సందర్భంగా పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులకు సిబిఆర్ ఫౌండేషన్ చైర్మన్ భరత్‌రెడ్డి సహకారంతో స్థానిక సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలు నేడు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. సిబిఆర్ ఫౌండేషన్ 300 మంది విద్యార్థులకు బ్యాగులు అందించిన చైర్మన్ భరత్‌రెడ్డిని అభినందించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కర్రె జంగమ్మ, ఉపసర్పంచ్ చెట్టిపల్లి గీతముత్యం, వార్డు సభ్యులు పెరుమాండ్ల సుదర్శన్, రాయబండి నవీన్, మట్ట విష్ణుగౌడ్, అంబటి సంధ్య, నల్ల అరుణ, నల్ల రజిత, ఓరుగంటి సరళ, బండిరాల శ్యామ్, సిబిఆర్ ఫౌండేషన్ సభ్యులు పవన్ కమార్, రమేష్, సత్యనారాయణ, శివకుమార్, నర్సింహా, మూర్తి, బాలచందర్, వెంకటేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News