నల్లగొండ: ముఖ్యమంత్రి కెసిఅర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి అకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో అనుముల మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి బీఅర్‌ఎస్‌లో చేరగా వారికి ఎమ్మెల్యే నోముల భగత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ కేసీఅ ర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధ్ది చెందిందన్నారు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, పీఏసీఎస్ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య, మున్సిపాల్ చైర్‌పర్సన్ వెంపటి పార్వతమ్మశంకరయ్య, మార్కెట్ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, యడవల్లి మహేందర్‌రెడ్డి, కూరాకుల వెంకటేశ్వర్లు, చెరుపల్లి ముత్యాలు, మార్కెట్ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, ఎంపీటీసీ ఉర్లగొండ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ప్రసాద్‌నాయక్, నల్లబోతు వెంకటయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.