- Advertisement -
నారాయణఖేడ్ టౌన్: రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్య వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఖేడ్ కళాశాలలో నూతనంగా అదనపు తరగతి గదులు నిర్మించుకున్నామన్నారు. ఒకప్పుడు 300లు కూడా లేని విద్యార్థులు నేడు 1100లు అడ్మిషన్లు తీసుకొని చదువుతున్నారన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగూలరైజ్ చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి రాథోడ్‌లక్ష్మీబాయి రవీందర్ నాయక్, ఎంపిపి తనయులు రమేష్‌చౌహాన్, మున్సిపల్ చైర్మన్ రుబినా నజీబ్, కళాశాల ప్రిన్సిపల్ కె.కృష్ణకుమార్, అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -