Saturday, November 16, 2024

అంగన్‌వాడీలో నాణ్యమైన సేవలను అందించాలి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలని జిల్లా సంక్షేమ అధికారిణి జి.జ్యోతి కోరారు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం స్ఫూర్తి సమావేశ మందిరంలో సిడిపిఒ, ఏసిడిపిఒ, మినిస్ట్రీయల్ స్టాప్ పోషణ అభియాన్ సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ సేవలు లబ్ధిదారులకు చేరే విధంగా సిబ్బంది అందరూ కృషి చేయాలని తెలిపారు. ప్రజలలో అంగన్‌వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పిస్తూ “అంగన్‌వాడీ బడిబాట” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ టీచర్లు పూర్వ ప్రాథమిక విద్య పై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని, పూర్వ ప్రాథమిక విద్య విధానం అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పద్ధతిలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తామని, క్రమం తప్పకుండా టీచర్లు శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, రోజువారీ అంగన్‌వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలు టీచర్ల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేపిస్తూ పారదర్శకంగా సేవలు అందేలా చూడాలన్నారు. జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో అన్ని విభాగాల సిబ్బంది తమ విధుల పట్ల అంకితభావంతో నిర్వర్తించాలని, అలసత్వం వహించరాదని, అనుమతి లేకుండా విధులకు గైరాజరైనట్లయితే రాష్ట్ర కమిషనర్ ఆదేశానుసారం శాఖపారమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలలో పెరటి తోట పెంపకాలు, పౌష్టికార విలువలపై అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో సంధ్యారాణీతోపాటు జిల్లాలోని సిడిపిఒలు, ఏసిడిపివోలు, మినిస్టీరియల్ స్టాఫ్ పోషణ అభియాన్ సిబ్బంది జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News