Tuesday, November 5, 2024

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యానందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ని యోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబి ఉత్సవాలలో భా గంగా తెలంగాణ విద్యా దినోత్సవంలో భాగంగా మంగళవారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ మన బస్తీమన బడి కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 23.05 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు డివిజన్ కార్పొరేటర్ పూజిత, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, మండల వి ద్యాధికారి వెంకటయ్యలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యానందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే మన బస్తీ, మన బడి కార్యక్రమంలో తెలంగా ణ విద్యా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. మన బస్తీ, మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు ఫిబ్రవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా ప్రా రంభం చేయడం జరిగిందన్నారు. దశలవారీగా అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు, మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్ర భుత్వ పాఠశాలల రూపురేఖరులు మారిపోతున్నాయన్నారు.

చూడముచ్చటైన తరగతి గదులు, క్లాస్‌రూంలో డ్యూయల్ డెస్కెలు, విద్యుత్తు వెలుగులు, పరిశుభ్రమైన టాయిలెట్లు, స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్‌లు, వంటగదులు, భోజనశాలలు, వాకింగ్ ట్రాక్‌లు, చుట్టూ ప్రహరీలు ఇలా అనేక సకల సదుపాయాలతో విద్యార్థు లు ఏకాగ్రతతతో నిశ్చితంగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లదకర వాతావారణాన్ని పంచిపెడుతున్నయన్నారు. పిల్లల చదువులకు సరికొత్త భరోసాను అందిస్తున్నాయన్నారు. నేడు ప్ర భుత్వ పాఠశాలు అసలు సిసలు సరస్వతి నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయన్నారు.

మన ఊరు, మన బడి మొదటి విడతలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి శేరిలింగంపల్లి మండల పరిధిలో 24, కూకట్‌పల్లి మండల పరిధిలో 7 మొత్తం 31 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కలిపించడం జరిగిందన్నారు. మిగతా పాఠశాలలను దశలవారీగా పూర్తి చేసి శేరిలింగంపల్లిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఇడబ్లుడిసి ఎఈ శ్యామ్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి ప్రతినిధులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News