Friday, November 22, 2024

మన ఊరు మన బడితో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారాయి

- Advertisement -
- Advertisement -

కోస్గి : ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక స దుపాయాలు కల్పించాలనే లక్షంతో తెలంగాణ ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు మనబడి పథకంతో పాఠశాలల రూపులేఖలు మారాయని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.మంగళవారం పట్టణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యాదినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉర్దు పాఠశాల,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,నాచారం,చెన్నారంలలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహి ంచిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మ ంచి విద్యతో పాటు మెరుగైన వసతి,నాణ్యమైన భోజనం అందించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్షమని అన్నారు.దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.మనఊరు మనబడి పథకంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధ్ది చేయడం జరిగి ందని అన్నారు.రాష్ట్రంలో ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధనను ప్రవేశ పెట్టిందన్నారు. విద్యార్థులందరూ మంచిగా చదువుకొని ఉన్నతంగా రా ణించాలని అన్నారు.

అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేశారు.అంతకు ముందు మనఊరు మన బడి పాఠశాలలతో పాటు గ్రంథాలయాలు,డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ,మున్సిపల్ చైర్‌పర్సన్ మ్యాకల శిరీష, ఎంపిపి మధుకర్‌రావు,జెడ్పిటిసి ప్రకాష్‌రెడ్డి,సింగల్ విం డో చైర్మన్ తూం భీంరెడ్డి,బిఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మ్యాకల రాజేష్,ఎంపిడివో వెంకటయ్య,ఎంఈవో అంజలీదేవి నాయకులు హన్మంతురెడ్డి, సాయిలు, వెంకట్‌రాములు,మధుయాదవ్, వరప్రసాద్,వెంకట్‌నర్సిములు,షాషలతో పాటు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News